Puskuri Srinivasa Rao and Rugby Sports
ఆకేరు న్యూస్, జనగామ : జనగామ జిల్లా రబ్బీ క్రీడా అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా రబ్బీ క్రీడా అసోసియేషన్ చైర్మన్గా, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావును అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ వివరాలను అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
* నూతన కార్యవర్గ సభ్యులు :
చైర్మన్ : పుస్కూరి శ్రీనివాసరావు (మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్)
గౌరవ అధ్యక్షులు : కొండ రవి,
అధ్యక్షులు : దొంతమల్ల గణేష్,
ఉపాధ్యక్షులు : మామిళ్ళ సోమల్లు,
ప్రధాన కార్యదర్శి : బాలబోయిన సందీప్,
ఆర్గనైజింగ్ కార్యదర్శి : రావుల కుమారస్వామి,
సంయుక్త కార్యదర్శులు : జోడు సంతోష్, మాచర్ల సుష్మిత,
కోశాధికారి : బాలబోయిన నరేష్
నూతనంగా ఎన్నికైన చైర్మన్ పుస్కూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో రబ్బీ క్రీడను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి పలువురు క్రీడాభిమానులు, స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
