raiparthy SRR foundation kits to Newly Married Couples
* నూతన వధూవరులను ఆశీర్వదించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్, రాయపర్తి : నిరంతరం నిరుపేద కుటుంబాలకు ఏ ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందుకు వచ్చి ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తూ నిరుపేద కుటంబాల హృదయాలలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి.
కొన్ని ఏండ్లక్రితం ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ (SRR Foundation) స్థాపించి తాను సంపాదించిన దాంట్లో 30% అనాధ పిల్లలకు మరియు నిరుపేద కుటుంబాలకు సేవచేయాలనే లక్ష్యంతో ప్రతిరోజూ పలు సేవ కార్యక్రమములలో పాల్గొంటూ, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న పరుపాటి శ్రీనివాస్ రెడ్డి కి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఇందులో భాగంగా మండలంలోని కొండాపురం గ్రామంలో గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు కొండేటి సుజాత – లక్ష్మయ్య కూతురు వివాహం ఇటీవల జరగగా ఈ రోజు నూతన వధూవరులను ఆశీర్వదించి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు అందజేశారు.
రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, మండల యూత్ ప్రధాన కార్యదర్శి సంకినేని ఎల్లస్వామి స్థానిక నాయకులు అయిన తెరాల సదానందం, చిర్ర శ్రీనివాస్, కొండా యాకయ్య, ఎండీ రియాజ్, కొండేటి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
