Rangarayi Gudem Solar Plant
* సోలార్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రంగరాయి గూడెంలో (Rangarayi Gudem) ఏర్పాటుచేసిన 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం ప్రారంభించారు.
ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు అడుగంటి జల విద్యుత్ ఉత్పత్తి తగ్గిన సందర్బంలో సహజసిద్ద సూర్య రష్మితో విద్యుత్ సరఫరా ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు విద్యుత్తు సరఫరా అందుబాటులో ఉంటుందన్నారు.
కార్యక్రమంలో సోలార్ ప్లాంట్ యజమాని నెల వంచ అజయ్ రెడ్డి, టు లైట్ కంపెనీ ప్రొప్రైటర్లు ప్రభాకర్, శివకుమార్, భాను ప్రసాద్ స్థానిక సర్పంచ్ జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, ఇప్పగూడెం సర్పంచ్ రాణి అనిల్, కోమటి గూడెం సర్పంచ్ సోమేశ్ ఆయా గ్రామాల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
