Rayaparthy ZPHS Teachers Day Celebrations
* రాయపర్తి జెడ్పీహెచ్ఎస్లో పాఠశాలలో
ఆకేరు న్యూస్,రాయపర్తి: రాయపర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో మంగళవారం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని విద్యాబోధకులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారే కృష్ణమూర్తి అధ్యక్షతన ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గారే సహేంద్ర భిక్షపతి హాజరై, సర్వేపల్లి రాధాకృష్ణన్, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గారే సహేంద్ర భిక్షపతి మాట్లాడుతూ — “సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనది. క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యనందిస్తూ విద్యార్థులను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని స్పష్టం చేశారు విద్యార్థులు ఉపాధ్యాయుల బోధనలను గౌరవిస్తూ, వారి మార్గదర్శకంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి” అని పిలుపునిచ్చారు.
పాఠశాల హెచ్ఎం గారే కృష్ణమూర్తి మాట్లాడుతూ — ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి తమ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. గురుపూజోత్సవం రోజున ఉపాధ్యాయుల సేవలను స్మరించుకోవడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.
అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను, సిబ్బందిని పూలమాలలు, శాలువాలతో సర్పంచ్ మరియు గ్రామ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
