Pulse Polio Programme in Rayaparthy
ఆకేరు న్యూస్,రాయపర్తి :
పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గ్రామసర్పంచ్ సహేంద్ర బిక్షపతి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ అరుణ్ చంద్రా ఉపసర్పంచ్ మచ్చ రమేష్ తోకలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో నివారణ కోసం ప్రభుత్వం అందిస్తున్న చుక్కల మందు ఐదేళ్ల లోపు పిల్లలకు వేయించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ కత్తి రవీందర్. డా” మధు, పిడిఎంఓ జయలత, గ్రామపంచాయితీ వార్డు సభ్యులు వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
