Anant Ambani TTD Donation
ఆకేరు న్యూస్, డెస్క్: భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తన సతీమణి రాధికా మర్చంట్‌తో కలిసి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వివాహం అనంతరం ఈ నూతన దంపతులు స్వామివారి ఆశీస్సులు VIP విరామ సమయంలో లడ్డూ ప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందజేసి ఆశీర్వదించారు.
* ₹27.5 కోట్ల విలువైన కానుక…
శ్రీవారి దర్శనానంతరం అనంత్ అంబానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) భారీ విరాళాన్ని ప్రకటించారు. తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు తోడ్పడేలా ₹27.5 కోట్ల విలువైన 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ (Eco-friendly) బస్సులను విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తుల ఉచిత రవాణా సేవల కోసం ఈ బస్సులను వినియోగించనున్నారు.
* డ్రైవర్ల జీతాలు, ఛార్జింగ్ స్టేషన్ల బాధ్యత రిలయన్స్‌దే..
ఈ విరాళం కేవలం బస్సులకే పరిమితం కాకుండా, వాటి నిర్వహణ బాధ్యతలను కూడా రిలయన్స్ సంస్థే స్వీకరించడం విశేషం. ఈ 25 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం నియమించే 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను రిలయన్స్ గ్రూప్ భరించనుంది.
తిరుమలలో ఈ బస్సుల కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అనంత్ అంబానీ అంగీకరించారు.
* ‘వంతారా’ తరహాలో తిరుమల గోశాల ఆధునీకరణ
అనంత్ అంబానీకి జంతు సంరక్షణపై ఉన్న మక్కువ అందరికీ తెలిసిందే. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం ‘వంతారా’ (Vantara) తరహాలోనే, తిరుమలలోని TTD ఎస్వీ గోశాలను కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు ఆయన ముందుకు వచ్చారు.
గోవుల సంరక్షణ, ఆధునిక వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలలో ‘వంతారా’ నైపుణ్యాన్ని ఉపయోగించి తిరుమల గోశాలను దేశంలోనే అత్యుత్తమ గోశాలగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేయనుంది.
శ్రీవారిపై అంబానీ కుటుంబానికి ఉన్న భక్తిశ్రద్ధలను, తిరుమల పర్యావరణంపై వారికకున్న అంకితభావాన్ని చాటుతూ చేసిన ఈ భారీ విరాళంపై భక్తులు మరియు టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
