CM Revanth Reddy
CM Revanth Reddy| అకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో విద్య, వైద్య రంగాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్, అల్వాల్ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. అలాగే వరంగల్, ఉస్మానియా ఆస్పత్రుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల నిర్మాణం పూర్తయ్యేలోపే అవసరమైన వైద్య సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
వైద్య పరికరాల కొనుగోళ్లను కూడా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత
సీజనల్ వ్యాధుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
గ్లోబల్ సమ్మిట్‌పై సమీక్ష
విద్య, వైద్య రంగాలతో పాటు డిసెంబర్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపైనా సీఎం సమీక్షించారు. సమ్మిట్ కోసం ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి అవసరమైన మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
