డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
- నాకు ఏ రాజకీయ పార్టీ వేదికగా పనిచేయాలో స్వేచ్ఛ లేదా…?
- గొర్రెల మందలో ఒకడిని కాదలచుకోలేదు.
- బీఆర్ ఎస్‌లో చేరుతున్నాను
- ప్యాకేజీల కోసం కాదు, ప్రజల కోసం వెళుతున్నా..
- బహుజన వాదం – తెలంగాణ వాదం ఒక్కటే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
సీఎం రేవంత్ రెడ్డి బెదిరించడం మానుకోవాలి. ఒక వైపు మిత్రుడు పాలమూరు బిడ్డ, మంచివాడు అంటూనే సుతిమెత్తగా తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని బెదిరిస్తున్నారని డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలకు ఏ పార్టీ వేదికగా పనిచేయాలో నిర్ణయించుకునే స్వేఛ్చ లేదా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ సారి పాలమూరు బిడ్డ ను అని రేవంత్ రెడ్డి చెబుతుంటాడు. మరీ నేను కూడా పాలమూరు బిడ్డనే అన్న విషయం కూడా మరచి పోవద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ చేసింది నిజమే.. తాను తిరస్కరించడం కూడా నిజమే నన్నారు. విస్తృత ప్రజా క్షేత్రంలో ఉండాలనకుంటున్నాను. అందుకే తిరస్కరించాను. అధికార పార్టీ వైపు పరుగులు పెట్టే గొర్రెల మందలో తానూ ఒకడిని కాకపోయినందుకు రేవంత్ రెడ్డి అక్కసుతో మాట్లాడినట్టు కనిపిస్తోందని ప్రవీణ్ కుమార్ అన్నారు.
*ప్యాకేజీల కోసమయితే అధికార కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళేవాడిని కదా.. - పోలీస్ ఉన్నతోద్యోగం వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చాను. గురుకులాల సెక్రటరీగా పది వేల మంది విద్యార్థులకు అధ్భుతమైన భవిష్యత్ నందించాను. రాజకీయ రంగంలో బహుజనవాదం ఎత్తుకున్నాను. ఇపుడు ప్యాకేజీల కోసం అయితే అధికార పార్టీ లోకి వెళ్ళేవాడిని. భారత రాష్ట్ర సమితిలో చేరింది ప్రజలకు సేవ చేయడం కోసమే అని గుర్తుంచుకోవాలి. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో గాణ వాదం – బహుజన వాదం ఒక్కటే. తరతరాలుగా అణిచివేతకురైన సామాజిక వర్గాల విముక్తి కల్పించి వాళ్ళని వెలుగు వైపు నడిపించింది . తెలంగాణ వాదం కూడా తరాలుగా అణచివేతకు గురైన ప్రజలకు విముక్తి కల్పించడమే. ఈ రెండిట్లో కూడా అణచివేత కామన్ గా ఉంది. గత పది సంవత్సరాలు ఒక స్వర్ణ యుగాన్ని ఒక బలమైన తెలంగాణకు ఒక గొప్ప పునాది కేసీఆర్ నాయకత్వంలో వేశారు. దురదృష్టవ శాత్తు ఈరోజు మరి అధికారంలో లేరు. ప్రజల గుండెల్లో మాత్రం ఇంకా కేసీఆర్ ఉన్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ పాలన కాలం తెలంగాణలో ఒక స్వర్ణ యుగమన్నారు. తెలంగాణను పునర్నిర్మాణం చేసే యజ్ఞంలో తాను భాగస్వామిని అవుతున్నానన్నారు. ఏ వేదికలో పనిచేసినప్పటికీ బహుజన వాదాన్ని మాత్రం వీడేది లేదన్నారు. నాతో కలిసి ఇంత కాలం కలిసి నడిచిన వారికి ఇపుడు కలిసి వచ్చే వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని ప్రవీణ్ కుమార్ అన్నారు.