DCP Rajamahendra Naik
DCP Rajamahendra Naik: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ గురువారం స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఉత్సవ కమిటీ సభ్యులు డీసీపీకి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు.
నిమజ్జనంపై సూచనలు
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు డీసీపీ సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
నిబంధనలు పాటించాలి
డీజేలు, ట్రాఫిక్ విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీసీపీ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీస్ శాఖకు సహకరించాలని కమిటీ సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో సీఐ ఎస్. శ్రీనివాస్, ఎస్సైలు వినయ్ కుమార్, మనీషా, శాశ్వత ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
