Erravalli lands
* అసైన్డ్ భూముల లెక్క తేలుస్తున్న అధికారులు
* సర్వే నంబర్ 325లో ఉద్రిక్తత మధ్య సర్వే
Erravalli lands ఆకేరు న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి భూముల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి విచారణను ముమ్మరం చేశారు. అసైన్డ్ భూముల కేటాయింపులు, భూ సరిహద్దులు, ఆక్రమణల ఆరోపణలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
సర్వే నంబర్ల వారీగా పరిశీలన
ఎర్రవల్లితో పాటు శివారు ప్రాంతాలైన వెంకటాపురం, వరదరాజుపూర్ గ్రామాల్లో అధికారులు సర్వే చేపట్టారు. ముఖ్యంగా సర్వే నంబర్ 325తో పాటు పరిసర ప్రాంతాల్లోని అసైన్డ్ భూములపై ప్రత్యేక దృష్టి సారించారు. భూములు ఎవరికి కేటాయించారు, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి, వాటికి సంబంధించిన రికార్డులు ఎలా ఉన్నాయి అనే అంశాలను పరిశీలిస్తున్నారు.
30 రోజుల్లో నివేదిక
అసైన్డ్ భూముల బదిలీలు, ధరణి పోర్టల్‌కు సంబంధించిన అంశాలు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై గతంలో చర్చ జరిగిన నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. భూములపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల బృందాలు సర్వే నంబర్ల వారీగా వివరాలు నమోదు చేస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. విచారణలో వెలువడే వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
