* ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు..
* పెళ్లి వేడుకకు వస్త్రాలు కొనుగోలు చేసి వస్తుండగా విషాదం
* ముప్పు తెచ్చిన నిద్ర మత్తు
ఆకేరు న్యూస్, అనంతపురం : కారు.. లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో వాహనం అదుపుతప్పి లారీ ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అనంతపురం నగరంలోని రాణి నగర్ చెందిన ఆలీ సాహెబ్ (58), సైక్ ఫిరోజ్ (28), మహమ్మద్ ఆయాజ్ (6), మహమ్మద్ ఆమన్ (4), రెహనా (48) ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా వివాహ వేడుకలకు హైదరాబాద్ వెళ్లి నూతన వస్త్రాలను కొనుగోలు చేసి కారులో తిరిగి అనంతపురానికి బయలుదేరి వస్తున్నారు. గుత్తి మండలం బాచుపల్లి గ్రామ సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై వీరు కారు అదుపుతప్పి ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో ఆలీ సాహెబ్, సైక్ ఫిరోజ్, మహమ్మద్ ఆయాజ్, మహమ్మద్ ఆమన్అ క్కడికక్కడే మృతి చెందారు. రెహానా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
————————–