* ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ఆకేరు న్యూస్ ములుగుః రైతు భరోసా పథకం కింద మంగళవారం నాటికి జిల్లాలోని 78, 347 మంది రైతుల ఖాతాల్లో రూ.96 కొట్ల 63 లక్షల రూపాయలు నేరుగా జమ అయినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మంగళవారం ఒక ప్రకటన తెలిపారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం కింద ఈ నిధులు పంపిణీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సాయంతో రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలు తీర్చుకునేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.. రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత సాధ్యమైందని కలెక్టర్ వివరించారు. వ్యవసాయానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన స్పష్టం చేశారు.
………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
