
* జాతర తేదీలు ప్రకటించిన ఆలయ పూజారులు
ఆకేర న్యూస్ మేడారం : ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన
సమ్మక్క సార క్క జాతర తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 28న సయ్మక్క జాతర ప్రారంభం కానుంది. 2026 బుధవారం జనవరి 28 న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారితో సహా గోవింద రాజు,పగిడిద్ద రాజులు గద్దెల పైకి వస్తారు. 29 గురవారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారని ఆలయ పూజారులు తెలిపారు.30న శుక్రవారం భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు.31 శనివారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క సారలమ్మఅమ్మవార్లు గోవిందరాజు పగిడిద్ద రాజులు తిరిగి వన ప్రవేశం చేస్తారని పూజారి సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు ఒక ప్రకటనలో తెలిపారు.
…………………………………………..