DTF
DTF| ఆకేరు న్యూస్, రాయపర్తి: తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయడం లేదా విలీనం చేయడం వల్ల బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి అన్నారు. కొండూరు జెడ్పీహెచ్ఎస్లో తన ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు.
బోధనేతర పనులు, యాప్ల నిర్వహణతో ఉపాధ్యాయులు బోధనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని తెలిపారు. పాఠశాలల విలీన నిర్ణయాన్ని విరమించుకుని, మౌలిక వసతులు కల్పించి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం లింగారెడ్డిని ఉపాధ్యాయులు, గ్రామ ప్రతినిధులు శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
