- పోస్టుమార్టానికి తీసుకెళ్తుండగా యువకుడి కేకలు
- నిర్ఘాంతపోయిన వైద్యులు..
ఆకేరు న్యూస్ డెస్క్ : ఓ ప్రమాదంలో ఆ యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స అనంతరం చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోస్టుమార్టం(Postmartam) చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చురీకి తీసుకెళ్తున్నారు.. ఇంతలో అందరికీ షాక్‌నిస్తూ, స్ట్రెచర్‌పై ఉన్న ఉన్న యువకుడు నేను బతికే ఉన్నానంటూ.. కేకలు వేశాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ (Uttarpradesh)లోని మేరఠ్ వైద్యకాలేజీలో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ జిల్లా గోట్కా గ్రామానికి చెందిన షగుణ్ శర్మ(Shagun Sarma) తన సోదరుడితో కలిసి గత నెల 30న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరూ గాయపడ్డారు. షగుణ్ శర్మ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మేరఠ్ వైద్యకాలేజీకి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో అతడు చనిపోయారని వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం కోసం స్ట్రెచర్ పై షగుణ్ శర్మను తరలిస్తున్న సమయంలో నేను బతికే ఉన్నా(I am Alive) అని అతడు గట్టిగా కేకలు వేశారు. దీంతో వైద్యులతో పాటు సిబ్బంది షాకయ్యారు. అతడికి వెంటనే చికిత్స ప్రారంభించారు. షగుణ్ శర్మ బతికున్నా చనిపోయినట్లు ఎలా ప్రకటించారని బంధువుల ఆందోళన చేపట్టడంతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్సీ గుప్తా విచారణకు ఆదేశించారు.
————–