CM Revanth Reddy, Ganesh Navratri Celebrations
* సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ప్రతినిధుల భేటీ
* ఆహ్వాన పత్రిక అందజేసిన అర్చకులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు ఘనంగా ఆహ్వానించారు. తెలంగాణ శాసనసభ లోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రిని బుధవారం ప్రత్యేకంగా కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్‌తో పాటు సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ముఖ్య సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. ఉత్సవాల వేళ దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణలు, హోమాలు, మహా అన్నదానం వంటి విశేష కార్యక్రమాల వివరాలను ఆలయ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు. పూజల్లో పాల్గొని శ్రీ వినాయక స్వామి వారి కృపాకటాక్షాలు పొందాల్సిందిగా వారు కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఈ ఆహ్వాన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రికి ఆలయ పవిత్ర తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ ప్రాంగణంలో, నగరవ్యాప్తంగా తగిన భద్రత మరియు మౌలిక వసతుల ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ, పోలీస్ అధికారులను సీఎం అభినందించినట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
