* భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. శనివారం రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపికకు గ్రామాల వారిగా టీముల ఏర్పాటు, గ్రామసభల షెడ్యూల్ తయారుచేయు అంశాలపై రెవెన్యూ, పంచాయతి రాజ్, వ్యవసాయ, డిఆర్డీఓ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణశాఖ, మండల ప్రత్యేక అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 26 నుండి లబ్ధిదారులకు నాలుగు పధకాలు అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రైతు భరోసా వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. వ్యవసాయ భూముల్లో ఇండ్లు నిర్మాణాలు, గోదాముల నిర్మాణం, రియల్ ఎస్టేట్, నాలా కన్వర్షన్, మైనింగ్ చేయు తదితర భూములకు నిలిపివేయాలని తెలిపారు. రేషన్‌కార్డులు మండల స్థాయిలో ఎంపిడివోలు, తహసీల్దార్లు, ప్రజాపాలన దరఖాస్తులు ప్రామాణికంగా తీసుకుని ఇంటి స్థలం ఉన్న పేదలకు, క్షేత్రస్థాయిలో విచారణ టీములు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ నెల 16 నుండి 20 వరకు వివరాలు సేకరించి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి తుది జాభితా తయారు చేయాలని తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారికి కులగణన జాభితా ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ, గ్రామసభలు నిర్వహణ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు సర్వే 96 శాతం పూర్తి అయిందని, వాటిలో 5 శాతం సూపర్ చెక్ చేయాలని, అర్హుల జాభితా ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులు 1.26.లక్షలు న్నాయని తెలియచేస్తూ గ్రీవెన్సు పోర్టల్ లో పిర్యాదు చేయవచ్చని గృహ నిర్మాణ శాఖ పిడి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 21 నుండి 24 వరకు గ్రామ సభలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ల అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, డిఆర్డిఓ నరేష్, వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, గృహ నిర్మాణశాఖ పిడి లోక్యానాయక్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
