* భగ్గుమంటున్న వెలమ సంఘాలు
* కూకట్‌పల్లిలో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం
* కేవలం కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించే అన్నాను : శంకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA VIRLAPALLI SANKAR) వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలమలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే శంకర్ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత వెలమ సంఘం డిమాండ్ చేసింది. కూకట్పల్లి(KUKATPALLY)లో శనివారం ఉదయం ఆయన దిష్టిబొమ్మను దహనం చేసింది.
పద్మనాయక వెలమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే శంకర్‌పై ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆ వ్యాఖ్యలు వెలమల పట్ల కాంగ్రెస్ అధికారిక వైఖరా ? అని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(MAHESH KUMAR GOUD)ను ఆమె ప్రశ్నించారు. కాగా, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. వెలమలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని శంకర్‌ను ఆదేశించారు. దీనిపై శంకర్ స్పందించారు. తాను కేవలం కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి మాత్రమే అన్నానని తెలిపారు.
……………………………….