* సమస్త ప్రజల ఆకాంక్షలు… సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి..
* ఎక్స్ లో సీఎం కేసీఆర్ భావోద్వేగ పోస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతా వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలను నేటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై భారీ సన్నాహాలు చేస్తోంది. విజయోత్సవాలు మొదలైనప్పటి నుంచీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY)జిల్లాలు పర్యటిస్తున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నేడు నల్గొండలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్ ఎక్స్ వేదికగా ఏడాది పాలనపై భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు.
పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను…
ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను…
అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి…
డిసెంబర్ 7, 2023 నాడు…
తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.
తన వారసత్వాన్ని సగర్వంగా…
సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే
బాధ్యతను అప్పగించింది.
ఆక్షణం నుండి…
జన సేవకుడిగా…
ప్రజా సంక్షేమ శ్రామికుడిగా…
మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో…
సకల జనహితమే పరమావధిగా…
జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా…
సహచరుల సహకారంతో…
జనహితుల ప్రోత్సాహంతో…
విమర్శలను సహిస్తూ…
విద్వేషాలను ఎదురిస్తూ…
స్వేచ్ఛకు రెక్కలు తొడిగి…
ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి…
అవనిపై అగ్ర భాగాన …
తెలంగాణను నిలిపేందుకు…
గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ…
నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ…
నిరంతరం జ్వలించే …
ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా…
విరామం ఎరుగక… విశ్రాంతి కోరక…
ముందుకు సాగిపోతున్నాను.
ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి…
సమస్త ప్రజల ఆకాంక్షలు…
సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి… అని ముగించారు.
……………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
