MLC Shambipur Raju
* టిమ్స్ పర్యటన వేళ ఉత్కంఠ
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం వద్ద ఉదయం నుంచే పోలీసులు మోహరించారు. ఉదయం 5 గంటల నుంచే పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రిని శంబీపూర్ రాజు సందర్శించనున్నారన్న సమాచారంతో ముందస్తుగా అక్కడికి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే తన నివాసం వద్ద పోలీసులు మోహరించడంపై శంబీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిమ్స్ సందర్శనకు వెళ్తున్నానన్న సమాచారంతో ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
MLC Shambipur Raju టిమ్స్ సందర్శన నేపథ్యంలో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారా? లేక ఇతర కారణాలతో మోహరించారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద పోలీసుల మోహరింపుతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
