AP BC Reservation
* సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన
ఆకేరు న్యూస్, అమరావతి : బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో ప్రత్యేక అప్పీల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు (AP BC Reservation) స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ప్రభుత్వం తదుపరి న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.
మరోవైపు పార్టీ పరంగా కూడా బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
