* అనర్హుల నుంచి రికవరీకి ఆదేశాలు
* దివ్యాంగుల కోటాలో అత్యధికంగా అనర్హులు
ఆకేరున్యూస్,అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్దారులకు షాక్ ఇవ్వనుంది. అనర్హుల నుంచి తీసుకున్న పింఛన్ డబ్బులను రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహిస్తున్న సదస్సులో రెండో రోజు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా సామాజిక పింఛన్లలలో సుమారు 6 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా అనర్హులున్నారని స్వయాన సంబంధిత మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడిరచారు. రాష్ట్రంలో 64 లక్షల మంది అన్ని రకాల పింఛన్దారులుండగా దివ్యాంగుల కోటాలోనే అత్యధికంగా అనర్హులున్నారని పేర్కొన్నారు. అయితే వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా సర్టిఫికేట్లు జారీ చేశారని ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో 10,958 పింఛన్లలో సుమారు 563 మంది అనర్హులున్నట్లు అధికారులు నివేదిక అందజేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం గురువారం నాటి కలెక్టర్ల సమావేశంలో అనర్హులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రానున్న మూడు నెలల్లో పింఛన్ తీసుకున్న అనర్హులను గుర్తించి రికవరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.
………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
