Mulugu
Mulugu| ఆకేరు న్యూస్, తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాముకాటుకు గురై ఆరు నెలల చిన్నారి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఈక తిరుపతి–స్వప్న దంపతుల ఆరు నెలల కుమారుడు ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా పాము కాటువేసినట్లు తెలుస్తోంది.
పాము కాటు వేసి తిరిగి వెళ్తున్న సమయంలో చిన్నారి తల్లి పామును గుర్తించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. 108 అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ, అనంతరం వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందినట్లు సమాచారం.
ఆరు నెలల బాబు పాముకాటుతో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి

Please tell us what is wrong. Your report will be sent to the website team.
