ఆకేరున్యూస్, ఆంధ్రప్రదేశ్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి ఉధృతికి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో రైల్వేట్రాక్ లు ధ్వసం అయ్యాయి. దీంతో ప్రయాణికులను తరించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. శనివారం అర్ధరాత్రి రాయనపాడు సాటిలైట్ రైల్వే స్టేషన్ చేరుకున్న తమిళనాడు ఎక్స్ ప్రెస్ లోని సుమారు 1600 మంది ప్రయాణికులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఆదేశాలతో విజయవాడ ఆర్డీవో పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు ప్రయాణికులను సురక్షితంగా విజయవాడ రైల్వే స్టేషన్ కు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ఉద్ధృతి దృష్ట్యా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన వాహనాల ద్వారా ప్రయాణికులను విజయవాడ రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించారు.
———————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
