* అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను గుర్తించాలి.
* ప్రజల జీవితాల్లో త్వరితగతిన మార్పునకు కృషి
* నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారీ అధికారి అన్వేష్ కుమార్.
ఆకేరు న్యూస్, ములుగు: అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను గుర్తించాలని, ప్రజల జీవితాల్లో త్వరితగతిన మార్పు తీసుకురావాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారీ అధికారి, డిప్యూటీ సెక్రటరీ, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్వేష్ కుమార్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కన్నాయిగూడెం బ్లాక్ కార్యక్రమంపై నీతిఆయోగ్ వాణిజ్య, పరిశ్రమల శాఖ డిప్యూటీ సెక్రటరీ అన్వేష్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన కన్నాయిగూడెం బ్లాక్ అభివృద్ధిని కొలవడానికి ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం నిర్దేశించిన ఐదు ప్రధాన రంగాలలో సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
