భద్రాచలం, ఆకేరు న్యూస్: భద్రాద్రి ఆలయంలో వైభవంగా తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ( Sri Rama Navami ) భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ రామ నామ స్మరణలతో భద్రాచలం విధులు మార్మోగుతున్నాయి. కల్యాణ వేడుకలో భాగంగా మంగళవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయ బద్దంగా సాగింది, ప్రబుత్వం తరఫున స్వామి వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవాదాయ శాఖ తరపున ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ పట్టు వస్త్రాలు అందచేశారు. మిథిలా మైదానంలో వైభవో పేతంగా సాగుతున్న అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భద్రాద్రికి భక్తులు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ తో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కల్యాణానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. ముత్యాల తలంబ్రాలు, లడ్డు ప్రసాదాల పంపిణికి కౌంటర్లు ఏర్పటు చేశారు. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్యూ ఆర్ కోడ్ తో దిశా నిర్దేశం చేశారు.
—————————–
Related Stories
October 9, 2024
October 9, 2024