Indira Bima scheme CONGRESS
* ఇందిరా భీమా పథకంతో 5 లక్షల ఆర్థిక సహాయం
… ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పేద ప్రజలు, రైతు, మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట, దేశాయి తండా, నష్కల్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులను బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.
పల్లగుట్టలో 20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు, 25 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. దేశాయితండాలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నష్కల్ లో 27 లక్షల 50 వేలతో నిర్మించిన సిసి రోడ్లను, ఇందిరమ్మ ఇల్లు, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల స్వంత ఇంటి కళను కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే 6 గ్యారెంటీల అమలులో భాగంగా అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, సన్నాలకు బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయని వెల్లడించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు ప్రతీ నెల 7 వేల కోట్ల మిత్తిలు చెల్లీస్తూ కూడా పేద ప్రజల సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 2 లక్షల కొత్త పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డులు, కోటి 10 లక్షల కుటుంబాలకు ఇందిరా కుటుంబ భీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద చనిపోతే 15 రోజులలో 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు.
పల్లగుట్టలో 30 ఏళ్ల క్రితమే గ్రామానికి నాలుగు వైపులా బిటీ రోడ్లు వేశానని, పాఠశాల, వాటర్ ట్యాంక్, సిసి రోడ్లు వంటి అభివృద్ధి పనులు నేను చేసినవే అని తెలిపారు. పల్లగుట్ట గ్రామానికి 30 ఇందిరమ్మ ఇండ్లు, కోటి 30 లక్షలతో పలు అభివృద్ధి పనులు మంజూరు చేశానని తెలిపారు. 20 లక్షల సిసి రోడ్లు, 25 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించుకున్నామని అన్నారు. 15 రోజులలో మహిళా కమ్యూనిటీ భవనానికి 10లక్షలు వెటర్నరీ హాస్పిటల్ కు 5 లక్షలు మంజూరు చేస్తానని రెండో విడతలో మరో 30 ఇందిరమ్మ ఇండ్లు, 33/11 కేవి విద్యుత్ సబ్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయాని అన్నారు. నష్కల్ నుండి ఉప్పుగల్ రోడ్డు మరియు ఆకేరు వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి 15 కోట్లు ఖర్చు అవుతాయాని 3 నెలల్లో ముఖ్యమంత్రితో మాట్లాడి బ్రిడ్జ్ మరియు రోడ్డు నిర్మాణానికి 15 కోట్లు మంజూరు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో 27 లక్షల 50వేల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్ల ప్రారంభించుకున్నామని త్వరలోనే మరో 25 లక్షల సిసి రోడ్లు మంజూరు ఇస్తానని అన్నారు. 20 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 10 లక్షలతో మహిళా కమ్యూనిటీ హల్ నిర్మాణ పనులు సాగుతున్నాయి అన్నారు. నష్కల్ గ్రామాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని మీ సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి స్థానిక సర్పంచులు ఎనగందుల నరసింహరెడ్డి, శాతబోయిన రాజు, ఉప సర్పంచులు రఫీ, మదన్, వార్డు సభ్యులు, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు ఎస్ కుమార్, డైరెక్టర్లు మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
