Chilpur Venkateswara Swamy Kalyanam
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగాం జిల్లా చిల్పూర్ శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానములో వేంకటేశ్వర స్వామి వార కళ్యాణం వేదమంత్రోచరణలతో అర్చకులు వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాలు, పట్టణాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరము భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో జరిపిన కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు వేముల వెంకటేశ్వర్లు, దారం రాజన్ బాబు, గణగోని రమేష్, గొల్లపల్లి వాసు, యాదగిరి, జూనియర్ అసిస్టెంట్ మోహన్ అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం
వెంకటాద్రిపెట్ వాస్తవ్యులు కేశిరెడ్డి రమణారెడ్డి-లలిత రెడ్డి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీపాద వినయ్-మౌనిక, హైదరాబాద్ కొండా శ్రీనివాస్- నిర్మల, రవి-మోహిని లక్ష్మిలు అన్నదాన వితరణ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
