Telangana employees demands PRC OPS
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయిస్ యాక్షన్ కమిటీ(TGEJAC) ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో డిఎస్ వెంకన్నకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో పర్యాయాలు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన స్పందించనందునా జేఏసీ పిలుపుమేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి డియస్ వెంకన్నకి మెమొరాండం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డిఓ, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది డిఏఒ శంకరయ్య, స్థానిక తహశీల్దార్ స్వప్న డిప్యూటీ తాసిల్దార్ సదానందం, సంధ్యారాణి, సునంద, సీనియర్ సహాయకులు, ఎమ్మారై, ఏఆర్ఐ, జిపిఓ, జూనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
* ఉద్యోగుల డిమాండ్లు..
*జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ (PRC) అమలు చేయాలి.
*రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలి.
*హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలి.
*సీపీఎస్ (CPS)రద్దు చేసి ఓపిఎస్ (OPS)ను పునరుద్దరించాలి.
*2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి.
*పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ డీఏ (DA)లను విడుదల చేయాలి.
*గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ(VRA)ల సమస్యలను పరిష్కరించాలి.
*ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
*ఉద్యోగ, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు చేపట్టాలి.
*ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
