* విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లోని అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. తదుపరి వాదనలను రేపు వింటామని సీజేఐ చంద్రచూడ్ (CJI Chandrachud) తెలిపారు. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విద్యుత్తు ఒప్పందాలపై జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి (L. Narasimha Reddy) నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు రెండోసార్లు నోటీసులు పంపించింది.విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. అక్కడకు ఆయనకు చుక్కెదురైంది.
————————————————-