Telangana takes new ₹7,500 Crore Loan
* రూ.7,500 కోట్ల సమీకరణ
* 16న ఆర్బీఐ ఈ-వేలం ద్వారా రుణ సేకరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీగా రుణం తీసుకోనుంది. రాష్ట్ర అవసరాల కోసం మొత్తం రూ.7,500 కోట్ల అప్పును సమీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించనుంది.
ఇందులో 13 ఏళ్ల కాలపరిమితితో రూ.1,500 కోట్లను 7.53 శాతం వార్షిక వడ్డీకి తీసుకోనుంది. అలాగే 18 ఏళ్ల కాలపరిమితితో రూ.2,000 కోట్లను 7.64 శాతం వడ్డీకి సమీకరించనుంది. మరో రూ.2,000 కోట్లను 23 ఏళ్ల కాలపరిమితితో 7.65 శాతం వార్షిక వడ్డీకి, ఇంకో రూ.2,000 కోట్లను 29 ఏళ్ల కాలపరిమితితో 7.65 శాతం వడ్డీకి ప్రభుత్వం తీసుకోనుంది. ఇలా నాలుగు విడతల్లో మొత్తం రూ.7,500 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమీకరించనుంది. ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం అనంతరం రుణ సమీకరణ ప్రక్రియ పూర్తికానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
