Tirumala Devotees Rush
* సర్వదర్శనానికి 24 గంటలు
* వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపలికి భక్తుల క్యూ
ఆకేరు న్యూస్, తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో టోకెన్లు లేని భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో దర్శనానికి సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో భక్తులు ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
* ఒక్కరోజే 81,724 మంది దర్శనం..
ఇక నిన్న శ్రీవారిని 81,724 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తుల్లో 38,361 మంది తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరింది. నిన్న ఒక్కరోజే రూ.4.04 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ అధికారులు క్యూలైన్లలో అవసరమైన ఏర్పాట్లు చేస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
