Tirumala Brahmotsavam Ankurarpana 2026
* రేపే అంకురార్పణ
ఆకేరు న్యూస్, తిరుమల : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. రేపు అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సవ వేడుకలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా రేపు సాయంత్రం శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు మాడవీధుల్లో విహరించనున్నారు. అనంతరం రాత్రి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
* పరివార దేవతలు, గరుడ పఠం ఉరేగింపు..
అంకురార్పణ అనంతరం ఎల్లుండి మధ్యాహ్నం మాడవీధుల్లో శ్రీవారి పరివార దేవతలు, గరుడ పఠం ఉరేగింపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.
* ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం..
ఎల్లుండి సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.
* రాత్రి పెద్దశేష వాహన సేవ..
ధ్వజారోహణం అనంతరం ఎల్లుండి రాత్రి 9 గంటలకు స్వామివారి పెద్దశేష వాహన సేవ జరగనుంది. శ్రీవారు వివిధ వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, వాహన సేవలు, భద్రత, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
