Srisailam Reservoir records zero inflow
* తగ్గుతున్న నీటి మట్టం
* ఇన్‌ఫ్లో నిల్.. ఔట్‌ఫ్లో 22,848 క్యూసెక్కులు
ఆకేరు న్యూస్, శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం నిలిచిపోయింది. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో నిల్‌గా ఉండగా.. దిగువకు 22,848 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జలాశయంలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 864.20 అడుగుల వద్ద నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 119.49 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మరోవైపు శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం కనిపిస్తోంది. కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఎలాంటి వరద ప్రవాహం లేకపోవడంతో.. జలాశయంలోకి వచ్చే నీరు, బయటకు విడుదల చేస్తున్న నీటి పరిమాణంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వరద ప్రవాహం తిరిగి ప్రారంభమైతే జలాశయ నీటిమట్టంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
