Anganwadi Teachers recruitment Hanumakonda
ఆకేరు న్యూస్, హనుమకొండ: తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించింది. హనుమకొండ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 55 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్థానిక మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ప్రాజెక్టుల వారీగా పోస్టులు..
భీమదేవరపల్లి ప్రాజెక్ట్: 23 పోస్టులు
హనుమకొండ అర్బన్ ప్రాజెక్ట్: 19 పోస్టులు
పరకాల ప్రాజెక్ట్: 13 పోస్టులు
మొత్తం: 55 పోస్టులు
ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులైన స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపడతారు.
* 100 మార్కులకు ఎంపిక
ఎంపిక ప్రక్రియ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్మీడియట్ మార్కులకు 70 మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నారు. అనాథలకు 10, విధవలకు 5, దివ్యాంగులకు 5 మార్కుల ప్రాధాన్యత ఉంటుంది. జిల్లా సెలక్షన్ కమిటీ (DSC) నిర్వహించే ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు.
* వయోపరిమితి
జూలై 1, 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.
* దరఖాస్తుకు చివరి తేదీ
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 22, 2026 నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 6, 2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ mis.tgwdcw.in ద్వారా సమర్పించాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
