Telangana Armed Peasant Struggle, Kaninika Ghosh,
* నినాదాలకే పరిమితమైన బిజెపి
* ఐలమ్మను మహిళా లు స్పుర్తిగా తీసుకోవాలి
* ఐద్వా జాతీయ కార్యదర్శి కనినిక గోష్
ఆకేరు న్యూస్, పాలకుర్తి : సబ్కా సాత్ సబ్ నినాదాలకి బిజెపి పరిమితమైందని పోరాటాల ద్వారానే ప్రభుత్వం మెడలు వంచాలని ఐద్వా జాతీయ కార్యదర్శి కనినిక గోష్ అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని వీరవానితుల స్ఫూర్తి యాత్ర పాలకుర్తిలో ప్రారంభ సందర్భంగా వీరనారి ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు,
అనంతరం ఏర్పాటు చేసిన సభకు ఐద్వా జిల్లా కార్యదర్శి ఎండి షబానా అధ్యక్షత వహించగా. ముఖ్యఅతిథిగా కనినిక గోష్, జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యావతితో కలిసి వారు మాట్లాడుతూ 1946 సంవత్సరం నుండి 1951 సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల పాటు సాగిన సమరం మొదటి భూస్వాములు దొరలు జాగిన్దారులు నైజాంతో జరిగిన పోరాటం తర్వాత యూనియన్ సైన్యాలతో కొనసాగిందన్నారు,
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు, దాడులు అణిచివేత పెరగాయని నాటి నైజాం కు నేటి బిజెపి ప్రభుత్వానికి తేడా ఏం లేదన్నారు, అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ రైతాంగం తిరుగుబాటు చేశారని కులమత ప్రాంతంగా భేదాలు లేకుండా ఆ పోరాటంలో ప్రజలు భాగస్వాములు అయ్యారని పోరాట ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో సెప్టెంబర్ 17న విలీనమైందన్నారు,
చాకలి ఐలమ్మ పోరాటంతో ఉద్యమం మొదలై దొడ్డి కొమురయ్య అమరత్వంతో నైజాం రాజ్యం అంత అగ్గి రగులుకుందని, విసునూరు రాపాక రామచంద్ర రెడ్డి ని గడగడ లాడించిన ఐలమ్మ, మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో నేటి బిజెపి ప్రభుత్వం పైన మహిళలు ఉద్యమించవలసిన అవసరం ఏర్పడిందని వారు అన్నారు.
సాయిధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ బిజెపి పాత్ర సున్నా
- ఐద్వ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
తెలంగాణ రైతాంగ తిరుగుబాటులో ఆర్ఎస్ఎస్ బిజెపి పాత్ర లేదని ఐద్వ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. హిందూ మహాసభ నాయకులు భూస్వాములకే వంత పాడారని. సాయిదా రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య పోరుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు.
ఇది వారి వంకర బుద్ధికి నిదర్శనమని, ఉద్యమం దొరలు భూస్వామునకు జాబిందార్లకు వ్యతిరేకంగా రైతులు సబ్బండ వర్గాలు జరిగిన ఉద్యమాన్ని హిందూ దొరలు హిందూ ప్రజలను పిప్పి చేశారని, ముస్లిం రాజైన నిజాం హిందూదళల దోపిడీకి అండగా నిలబడాలని, ఈ వాస్తవాన్ని మరిపించి ఎన్నో ముస్లిం తగాదాగా చిత్రీకరించడం అంటే దొరల దోపిడీకి కొమ్ము కాయడమేనన్నారు. ప్రజా పోరాటాన్ని అవమానించడం రాజకీయ లబ్ధి కోసం బిజెపి చేస్తున్న వక్రీకరణ కుట్రను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఐద్వారా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, టి జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవేటి సరళ, కే ఆశలత, నలిగంటి రత్నమాల, రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, బత్తుల హైమావతి, జిల్లా అధ్యక్షురాలు ఇవి అహల్య, మోకు భవాని, సంపూర్ణ, వెన్నెల, లక్ష్మి, పద్మ, ప్రజా సంఘాల నాయకులు చిట్యాల సోమన్న, మాచర్ల సారయ్య, సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, సోమ అశోక్ బాబు, ముస్కు ఇంద్రారెడ్డి, ఎండి శంషుద్దీన్, మంజుల, సంధ్యారాణి, పద్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
