* ఇంజనీరింగ్‌లో బాలికలదే పైచేయి
* తొలి తొమ్మిది ర్యాంకులు మాత్రం బాలురవే
* ఫలితాలు తెలుసుకోండి ఇలా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (టీఈఏపీ సెట్) 2024 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్లో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మే 7, 8 తేదీల్లో జరిగిన TS EAPCET పరీక్షకు మొత్తం 1,00,449 మంది అభ్యర్థులు హాజరు కాగా, మే 9 నుంచి 11 వరకు జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు 2,54,814 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ లో 74.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రకల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 89 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంజనీరింగ్ విభాగం
ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. అయితే.. టాప్ ర్యాంకర్లలో బాలురు ఉండడం గమనార్హం. మొదటి, రెండో ర్యాంక్ సాధించినవారిలో ఏపీ విద్యార్థులు ఉన్నారు.
టాప్ టెన్ ర్యాంకర్లు వీరే..
1. సత్యవాడ జోత్యిరాధిత్య (శ్రీకాకుళం – పాలకొండ)
2. గొల్లలేఖ హర్ష (కర్నూలు – పంచలింగాల)
3. రుషి శేఖర్ శుక్లా (సికింద్రాబాద్ – తిరుమలగిరి)
4. సందేవ్ (హైదరాబాద్ – మాదాపూర్)
5. యశ్వంత్ రెడ్డి (కర్నూలు)
6. కుశల్‌కుమార్ (అనంతపురం – ఆర్కేనగర్)
7. విదిత్ (హైదరాబాద్ – పుప్పాలగూడ)
8. రోహన్ ( హైదరాబాద్ – ఎల్లారెడ్డిగూడ)
9. మణితేజ (వరంగల్ – స్టేషన్ ఘణపూర్)
10. శ్రీనిధి (విజయనగరం)
అగ్రకల్చర్ అండ్ ఫార్మసీ విభాగం
ఈ విభాగంలో 89 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో కూడా తొలి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులవే. టాప్ టెన్ ర్యాంకర్లు ఎవరంటే..
1. ప్రణీత (మదనపల్లె)
2. రాధాకృష్ణ (విజయనగరం)
3. శ్రీవర్షిణి (హనుమకొండ)
4. సాకెత్ రాఘవ్ (చిత్తూరు)
5. సాయి వివేక్ (హైదరాబాద్ – ఆసిఫ్‌నగర్)
6. మహ్మద్ అజాన్సాత్ (హైదరాబాద్ – నాచారం)
7. ముఖేష్ చౌదరి (తిరుపతి)
8 భార్గవ్ సుమంత్ (హైదరాబాద్ – పేట్‌బషీరాబాద్)
9. ఆదిత్య (హైదరాబాద్ – ఆల్విన్‌కాలనీ)
10. దివ్యతేజ (శ్రీసత్యసాయి జిల్లా – బలిజపేట)
ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా..
– ముందుగా TS EAPCET అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
– అనంతరం TS EAPCET 2024 Results ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
– తర్వాత మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.
– TS EAPCET 2024 ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
—————-