* ఈ-కేవైసీ గడువు ఆగస్టు 30 వరకు పొడిగింపు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ ఈ-కేవైసీ అప్డేషన్ గడువును పొడిగిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ఉన్న గడువును ఆగస్టు 30, 2026 వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. లబ్ధిదారులు తమ సమీపంలోని రేషన్ షాప్ లేదా అధీకృత కేంద్రాన్ని సందర్శించి, ఆధార్ కార్డు, రేషన్ కార్డులను వెంట తీసుకెళ్లి, బయోమెట్రిక్ వేలిముద్ర లేదా ఆధార్ ఓటీపీ ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించినట్లు జిల్లా మేనేజర్ తెలిపారు. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకొని రేషన్ లబ్ధిని ఎలాంటి అంతరాయం లేకుండా పొందాలని, మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.
* లబ్ధిదారులు ఏం చేయాలి?
1. కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి, మీ రేషన్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయండి.
https://smartpds.telangana.gov.in/SRC_Trans_Int
2. ఆ లింక్ ద్వారా మీ కార్డులో ఎవరికి ఈ-కేవైసీ (బయోమెట్రిక్) పూర్తయింది, ఎవరికి కాలేదో చెక్ చేసుకోండి.
3. ఈ-కేవైసీ పూర్తి కాని వారు వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణానికి (Fair Price Shop) వెళ్లి, అక్కడి ePoS మిషన్ ద్వారా వేలిముద్ర వేసి ఈ ప్రక్రియను ఆగస్టు 30లోగా పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
