Pensioners New Rules
* లైఫ్ సర్టిఫికెట్‌కు ఆధార్ తప్పనిసరి
* వెరిఫికేషన్ తర్వాతే ఆమోదం
* ట్రెజరీ శాఖ కొత్త ఆదేశాలు
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని పెన్షనర్లకు సంబంధించి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షనర్లు మ్యాన్యువల్‌గా సమర్పించే వార్షిక లైఫ్ సర్టిఫికెట్లను స్వీకరించే సమయంలో వారి ఆధార్ కార్డు ప్రతిని తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆధార్ వివరాలను సరిచూసిన తర్వాతే లైఫ్ సర్టిఫికెట్లను ఆమోదించాలని జిల్లా ట్రెజరీ అధికారులను ఆదేశించింది.
* పెన్షనర్ల డేటాలో ఆధార్ తప్పులు..
రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్ల డేటాబేస్‌ను పరిశీలించగా కొందరి ఆధార్ నంబర్లు చెల్లనివిగా లేదా తప్పుగా నమోదైనట్లు గుర్తించినట్లు డైరెక్టరేట్ తన మెమోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పెన్షనర్ల వివరాల్లో తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలని నిర్ణయించింది. మాన్యువల్‌గా సమర్పించే లైఫ్ సర్టిఫికెట్ల విషయంలో ఆధార్ వివరాలను ధ్రువీకరించిన తర్వాతే వాటిని స్వీకరించాలని సూచించింది.
* జిల్లా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు..
ఈ మేరకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కె. పార్వతి దేవి అక్టోబర్ 31, 2026న మెమో నంబర్ H4/1237/2015 జారీ చేశారు. హైదరాబాద్ పెన్షన్ పేమెంట్ ఆఫీస్ జాయింట్ డైరెక్టర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ అధికారులకు ఈ ఆదేశాలు పంపించారు. పెన్షనర్లు మాన్యువల్‌గా సమర్పించే వార్షిక లైఫ్ సర్టిఫికెట్లను పరిశీలించే సమయంలో ఆధార్ కార్డు ప్రతిని తీసుకుని, అందులోని వివరాలను ధ్రువీకరించిన తర్వాతే ఆమోదించాలని మెమోలో స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

