ఆకేరు న్యూస్, డెస్క్:తెలంగాణలో పురపాలక పోరుకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు (Corporations)మరియు 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)నేడు ప్రకటించనుంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మరియు పోలీస్ కమిషనర్లతో కీలక సమావేశం నిర్వహించి, భద్రత మరియు ఏర్పాట్లపై సమీక్షిస్తారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)రామకృష్ణారావుతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సన్నద్ధతను చర్చిస్తారు.అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు.పోలింగ్ తేదీ ఫిబ్రవరి 11, ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయగా, ఎన్నికల సంఘం కూడా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల తరలింపు వంటి ఏర్పాట్లు ఇప్పటికే ముగిశాయి. నేడు షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.
…………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
