Aishwarya Rai
* కొత్త లుక్‌తో అదుర్స్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఆమె సందడి చేశారు.
ఐఫిల్ టవర్, ఎకోల్ మిలిటైర్ అద్భుతమైన నేపథ్యంగా నిలిచిన ప్లాస్ జోఫ్రే వేదికపై జరిగిన ఫ్యాషన్ షోలో ఐశ్వర్య ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఆమె కొత్త హెయిర్ కలర్‌తో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* బ్లాక్ కౌచర్లో రాయల్ లుక్
‘ఎక్స్‌ప్రెస్ యువర్ వర్త్’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్ కోసం ఐశ్వర్య.. సిరియన్ లగ్జరీ ఫ్యాషన్ లేబుల్ ‘యారా షూమేకర్’ రూపొందించిన కస్టమ్ బ్లాక్ కౌచర్ గౌన్‌ను ధరించారు.
ఈ దుస్తులను ఆ లేబుల్ ఫాల్/వింటర్ 2026-27 కౌచర్ కలెక్షన్లో భాగంగా రూపొందించింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ ఈ లుక్‌ను కాన్సెప్ట్ చేసి స్టైల్ చేశారు.
* ఆకట్టుకున్న గౌన్ డిజైన్..
ఐశ్వర్య ధరించిన గౌన్‌లో కార్సెట్ తరహా బాడీస్, డీప్ నెక్లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాడీని హైలైట్ చేసే ఫిటెడ్ సిల్హౌట్‌తో రూపొందించిన ఈ గౌన్ చివర్లో నేలను తాకే ఫిష్‌టెయిల్ హేమ్‌తో మెరిసింది.
మొత్తంగా ఈ కౌచర్ లుక్కు రాయల్ టచ్ రావడంతో ఐశ్వర్య ర్యాంప్‌పై ప్రత్యేకంగా కనిపించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
