* ఆర్థిక మంత్రులతో సీతారామన్ భేటీ
* బడ్జెట్‌పై సలహాలు, సూచనలు స్వీకరణ
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ (BJP) ప్రభుత్వం సాధారణ బడ్జెట్ (General Budget) 2024-25పై కసరత్తు మొదలుపెట్టింది. బడ్జెట్ అంచనాలు, రూపకల్పనపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రు (Finance Ministers of the States) లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీ (Delhi) లోని భారత్ మండపం (Bharat Mandapam) లో జరిగిన ఈ భేటీకి తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ఆంధ్రప్రదేశ్ నుంచి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), రాజస్థాన్ నుంచి దియా కుమారి (Diya Kumari), యూపీ నుంచి సురేష్ కుమార్ ఖన్నా(Suresh Kumar Khanna), ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ఆర్థిక మంత్రులు (Finance Ministers) హాజరయ్యారు. బడ్జెట్ (Budget) కు సంబందించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. కాగా, కేంద్ర బడ్జెట్ (Central Budget) 2023-24ని ఫిబ్రవరి 1, 2023న ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్పించారు. ఆర్థిక సంవత్సరంలో రూ .45,03,097 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ప్రీ బడ్జెట్ సమావేశం (Pre Budget meeting) అనంతరం నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ (GST Council) సమావేశంలో పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్ 7న చివరిసారిగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత జరగాల్సిన కౌన్సిల్ మీటింగ్‌ను.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా మరోసారి నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. దీంతో తదుపరి కౌన్సిల్ మీటింగ్‌ను ఈరోజు నిర్వహించారు. స్టాండింగ్ కమిటీ నిర్ణయాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.
—————————-