* మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటి సమంత
ఆకేరు న్యూస్, డెస్క్ : నా విడాకులు నా వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నానని నటి సమంత పేర్కొన్నారు. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలని పేర్కొన్నారు. కొండా సురేఖ గారూ.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నానని.. దయచేసి చిన్నచూపు చూడకండని వేడుకున్నారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాలపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నానని తెలిపారు. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయని.. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదన్నారు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరని కోరుకుంటున్నానని తెలిపారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
