* రైలు పట్టాలపై రీల్స్ చేస్తుండగా ఢీ కొన్న రైలు
ఆకేరున్యూస్, ఉత్తరప్రదేశ్ : రీల్స్ సరదాకు కుటుంబం మృత్యువాత పడిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కుమారుడితో కలిసి పట్టాలపై రీల్స్ చేస్తున్న దంపతులను రైలు ఢీకొంది. దీంతో మూడేళ్ల బాలుడితో సహా దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సీతాపూర్ జిల్లా, ఉమారియా గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో అహ్మద్(26), భార్య అయేషా (24), కుమారుడు అబ్దుల్లా (3) గా గుర్తించారు.
—————————