* అక్కినేని అఖిల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ స్పందించారు. కొండా సురేఖ మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. మంత్రిగా, ప్రజా సేవకురాలిగా, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతిక బాధ్యతను మరచిపోయారని విమర్శించారు. ఆమె ప్రవర్తించిన తీరు సమాజానికి సిగ్గుచేటన్నారు. కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను ఈ విషయంలో మౌనంగా ఉండనని.. ఇలాంటి వ్యక్తికి మన సమాజంలో ఉండే హక్కు లేదన్నారు. ఆమెలాంటి వాళ్లకు ఇక్కడ చోటు లేదని.. ఇది క్షమించరాని తప్పని.. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదని ఘాటుగా స్పందించారు అఖిల్.
………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
