* ఎన్నికకు రేపు నోటిఫికేషన్.. ఎల్లుండి నామినేషన్
* జూలై ఒకటిన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ఎన్నికకు మార్గం సుగమం అయింది. ఈ నెల 29న అమిత్ షా (AMITHSHAW) నిజామాబాద్ రానున్నారు. అదే రోజు అధ్యక్షుడి ఎన్నికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం అన్న ధీమాతో పార్టీ నేతలు ఉన్నారు. దీంతో అధ్యక్షుడి పదవికి డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ బీజేపీ ముఖ్యనేత, బీజేపీ (BJP) జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు కౌంట్ డౌన్ మొదలైందనే ప్రచారాన్ని బలపరిచాయి జులై రెండో వారం నాటికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు లక్ష్మణ్. ఇక అధ్యక్ష పదవి ఎవరికి దక్కొచ్చనే అంశంలోనూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల విషయంలో పాత, కొత్త అనే తేడాలు ఉండబోవని అన్నారు. ఆయన మాటలతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. ఈక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి కోసం రేపు నోటిఫికేషన్ వెలువడనుండడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆశావహులు ఎల్లుండి నామినేషన్ వేయనున్నారు. జూలై ఒకటిన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉండనుంది.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
