* శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్ వే పరిసరాల్లో కలకలం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శంషాబాద్ ( Air Port ) లో చిరుత ( Tiger ) కలకలం సృష్టిస్తోంది. స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఎయిర్ పోర్టు రన్ వే పరిసరాల్లో ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్ సిబ్బంది చిరుతను గుర్తించారు. ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వైల్డ్ లైఫ్ అధికారులకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఫిర్యాదు చేసింది. ఇంకా పరిసరాల్లోనే చిరుత ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుత కదలికలను గుర్తించేందుకు వైల్డ్ లైఫ్ అధికారులు రంగంలోకి దిగారు.
—————