* సుమారు 200 హెక్టార్లలో కూలిచ చెట్లు
* ఘటనాస్థలిని పరిశృలించిన అటవీశాఖ అధికారి ప్రభాకర్
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో సుమారు 200ల హెక్టార్లలో గాలివాన బీభత్సం సృష్టించింది. అడవుల్లో ఏర్పడిన సుడిగాలుల ప్రభావానికి సుమారు 50వేల చెట్లు నేలకూలాయి. ఇటీవల పరిశీలనకు వెళ్లిన అధికారులు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. టోర్నడో వంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చి వేస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూలిన చెట్లను గమనిస్తే ఈదురు గాలులు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వీచినట్లు పేర్కొంటున్నారు. భారీ సంఖ్యలో చెట్లు నేలకొరగడంపై విచారణ చేపడుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.