* తెలంగాణలో ఫస్ట్ అండ్ సెకండియర్ ఒకేసారి విడుదల
* గతేడాది కన్నా తగ్గిన ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత
* ఇంటర్ బోర్డ్ వైబ్సైట్లో అందుబాటులోకి ఫలితాలు
* మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఉదయం విడుదల చేశారు. ఎన్నడూ లేని రీతిలో 15 రోజులు ముందుగా, అదీ.. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి అందుబాటులోకి తెచ్చారు. గతేడాది మే 10న ఫలితాలు వెల్లడించగా, ఇప్పుడు ఏప్రిల్ 24నే ఇచ్చామని వెంకటేశం తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ లో 60.01 శాతం, సెకండియర్ లో 64.19 ఉత్తీర్ణత సాధించారు. బాలికలే ఆధిక్యంలో ఉన్నారు. ఫస్టియర్ లో ఉత్తీర్ణతా శాతం గతేడాది కన్నా 2 శాతం తగ్గింది. ఫస్టియర్ ఉత్తీర్ణలో రంగారెడ్డి జిల్లా టాప్‌లో ఉండగా, మేడ్చల్ సెకండ్ ప్లేస్ లో ఉంది. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా టాప్‌లో నిలిచింది.
ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా..
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగగా, 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇంటర్ బోర్డ్ వైబ్సైట్లో ఫలితాలు అందుబాటులోకి ఉంటాయని అధికారులు వెల్లడించారు. https://tsbie.cgg.gov.in లేదా.. https://results.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు. DROIT @24 పాస్వర్డ్ తో లాగిన్ అయి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
అవసరమైతే విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి నుంచి మే 2 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫెయిలైన విద్యార్థుల కోసం మే 24 నుంచి సప్లిమెటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
——————————————————–