Published:
Updated: 10 Jan 2025 • 08:45 AM
ఆకేరున్యూస్, జనగామ: జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. కొడకండ్ల మండలం గిర్ని తండా వద్ద హైవేపై డీసీఎం-తుఫాన్ వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతులు సూర్యాపేట జిల్లా ఈటూరు వాసులుగా గుర్తించారు.
………………………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
